Posts

Showing posts with the label telugu

దేవుడు చేసిన మనుషులు

Image
దేవుడు చేసిన మనుషులు అంటారు, దేవుడు చేతుల్లోని పావులు అంటారు, అన్నింటికీ నింద ఆ దేవుడిమీదే, మనుషుల భాధల భారం వాడిదే పాపం, ఉన్నాడా నీ ఆ దేవుడు, ఉంటే వింటాడా నీ మోర, కన్నాడా ఏనాడైనా నీ రొద, చుశాడా నీ కళ్ళలో వ్యధ. ఉన్నాడని వాదించేంతా గొప్పోడిని కాదు నేను, లేడంటూ నిందించే మనిషిని కాదు నేను, ఉన్నాడో లేదో అని అనుమానించే స్థాయిలోను లేను నేను, కానీ, ఉన్నాడని నమ్మేవాళ్ళకి ధైర్యం ఆ పైవాడు, లేదని నిందించేటోల్లకి ఏమీ చెయ్యలేని వాడు. నమ్మడం నమ్మక పోవడం నీ ఇష్టం, మొత్తం దేవుడే అని వదిలేస్తే నీకే కష్టం, నిన్ను నువ్వు నమ్ముకోడం నీ అద్రుష్టం, అలా నమ్మి ముందుకు సాగడం మహోత్క్రుష్టం. గాలిని చుశావా కళ్ళతో ? లేదని శ్వాశ ఆపగలవా? కాలాన్ని ఆపగలవా చేతితో? చేతికి గడియారం ఉందికదా అని!! కళ్ళుమూసుకుంటే కనుమరుగవుతాడా  మండే సూరీడు? దేవుడు ఓ నమ్మకం, మనిషి ఓ నిజం, నిజాన్ని నమ్ము, నువ్వు నమ్మింది నిజంచెయ్యి, నిజమైన నమ్మకం నీమీద నీకుంటే, దేవుడు కుడా నిజమౌతాడు. --  మీ  సాయి కార్తీక్

లక్ష్యసాధన - గమ్యఛేదన

Image
రమ్మన్నా రాదు నిన్నటి నీ కల, తాకి వెళ్ళిన గాలి తరగలా, నిద్రపోయిన నువ్వు కాదన్న మాత్రాన నిన్నటి నీ లోపం పోతుందా, మేల్కొంటే ముందడుగు వేస్తావు లోకం నివ్వెరపోయి నిన్ను చూసేట్టు, వెయ్యాలి చేతల్తో చాటింపు చెవులూరే జయజయధ్వానాలకై. నిండుగా సాగిపోయే మేఘం వర్షించక మానదు, నీ కష్టం ఫలించక మానదు, ఏ కొమ్మైనా కాయ ఇవ్వను పొమ్మంటుందా,వెన్నెల నే విరబూయను వెళ్ళిపోమంటుందా, నీటి బొట్టు నేను నడవలేనని నిలుచుంటుందా,తిరగలేనని భూమి ఆగిందా, ఆగదు ఏ నిమిషము ఏ లోకం ఆగితే సాగదు మానవ ప్రయాణము. విజయం వరించక వెళ్ళగలదా, ఓటమి వదలివెళ్ళక వెనకుంటుందా, నీ ప్రయత్నం, నీ కష్టం, నీ ఓరిమి, నీ తపన, నువ్వు వదలనంత కాలం , నీ అడుగే తొలి అడుగు, మలి అడుగే ముందదుగు. చేరగలనా గమ్యం అనే చిన్న అనుమనం, చిన్న తీరం కుడా దాటనివ్వదు, ఓటమి అనే ఊహ కుడా చివరికి ఊహకందని ఓటమి అవుతుంది, అందదనే ఆలోచన కూడా, కలవని రైలు పట్టాల్లా కలుసుకోలెవు. నిప్పుల కొలిమిని చూడందే బంగారం మెరిసిందా? కాలికింద నలగందే ఏ మట్టైనా చల్లని చలివేంద్రమయ్యిందా? శిల్పి ఉలి రుచి చూడందే శిలకి రూపం వచ్చిందా? ఒక్కో ఓటమి మెట్టు ఎక్కుతూ విజయ శిఖరం చేరు, నిన్నటి...

గంగా తాండవం

Image
ఉరికింది ఉరికింది ఆకాశగంగ, హరుడు హరించమని అడుగంగ, అడుగులో అడుగై నేలంతా మడుగై, పాపం పుణ్యం అన్నీ మరిచి, పిన్నలు పెద్దలు భేధం విడిచి, నింగినుండి నేలకు జారి, ఆ రెండింటిని ఏకం చేస్తూ, శివుడే నేల చేరి నాట్యమాడేనా అనేట్టుగా, ఆ హరునే హరిస్తుందేమో అనేంతగా, ఉరికింది ఉరికింది ఆకాశగంగ. గంగమ్మను ఇన్నాళ్ళు మోసిన శివయ్య, ఇక చాలనుకుని, ఇంతమందిని పొట్టనపెట్టుకోమని ఆఙాపించావా? నీ ఆఙ లేనిదే చీమైనా చలించదు కదా, నిన్ను చూడ వచ్చినవారిని నీలో చేర్చుకున్నవా? అందుకే అందర్నీ ముంచిన ఆ హిమగంగ, నిన్ను తాకే ధైర్యం చేయలేదుగా, ఆఙా నీదీ,ఆది అంతం నీదీ,ఐక్యం అయ్యే శివ తాండవం నీది!! -- మీ  సాయి కార్తీక్

Telugutanam

Image
I was there in Hyderabad for Sankranthi on a long leave and had the pleasure to watch the film 'Seethamma Vakitlo Sirimalle Chettu'. In the film Mahesh Babu asks a modern Telugu girl (yet to come to a conclusion on the term 'Modern Telugu Girl/woman')  "Puvvu isthe ekkda pettukuntave?"  with profound sarcasm and logic behind it, this dialogue reflected my thought and mindset. Ordinary readers can also have their own opinions and criticisms after reading the entire post. I seriously wonder if the word 'Telugutanam' is relevant anymore?. Dressing style of Telugu people has undergone drastically, Telugu costumes are now just a part of festivals and auspicious ceremonies and beware - we are not wearing them because of our love for telugutanam but as a competition with our colleagues, buddies and relatives to exude our pseudo respect to our Telugu culture. Outsourced Telugu-tanam The elite Telugu...

ఓ స్త్రీ నీకు పాదాభివందనం

Image
ఓ స్త్రీ నీకు పాదాభివందనం, అమ్మవై అందరికి జన్మవైనావు, చెల్లివై అందరికి చేరువౌతావు, భార్యవై అనుభందానికి దారివైనావు. నీ ఓర్పు కలగలిపితే భూమి అవుతుంది, నిన్ను ఙ్నానం అర్ధిస్తే శారదవే అవవా? నీ కోపం చూడాలంటే కాళీరూపమే కాదా? నీ ఐశ్వర్యం కలిగితే లక్ష్మివే అవవా? కానీ, జన్మనిచ్చి నీవు రొమ్ము పాలిస్తే, రొమ్ము జుర్రి మేము గుండెనే తంతాము. తోబుట్టువై నీవు తోడునవుదామనుకుంటే, తోడేల్లలా మేము తోలువలుస్తాము. చెలివై నీవు చెంతనచేరతావు, మాటలతో నిన్ను చిత్రహింస పెడతాము. ప్రేయసి లా మారి ప్రేమంతా కురిపిస్తే, కామంతో నిన్ను కుళ్ళబొడుస్తాము. మాది, పురుషహంకారం - మాట వినం ఇది హూంకరం, ఉన్మాదం - స్త్రీని లోబరుచుకోవడం వినోదం, పైశాచికం - ఏమాత్రం జాలి లేని అరాచకం, మాది మగజాతి, (ఆడ)మానవత్వం లేని మ్రుగజాతి!! -- మీ  సాయి కార్తీక్

??? ఏమో ???

Image
ఏమో? ఏమో? సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం, ఏమో? సమాధానం చెప్పలేని ప్రశ్నలకు సమాధానం, ఏమో? ప్రశ్నలే మనసునిండా ఉంటే వచ్చే సమాధానం, ఏమో? ప్రశ్నలే సమాధానం అయినప్పుడు చెప్పే సమాధానం, అర్థంకాలేదా పై నాలుగు వాక్యాలు, ఏమో? అర్థమైనా ఒప్పుకోలేనివా ఆ నాలుగు వాక్యాలు, ఏమో? అర్థంలేనివి అనైనా కొట్టిపారేస్తావా పోనీ, ఏమో? అర్థంవెతికే ప్రయత్నం చేస్తావా పోనీ, ఏమో? ఏమో? ఏమో? ఏమో? ఏమో? రంగుల ప్రపంచం మాత్రమే కోరుకునే ఓ మనసా, కలలేకంటూ, హరివిల్లే ఇల్లు అవ్వాలనేది నీ ఆశ, వాస్తావాల వాసన చూసేసరికి, అవాక్కయ్యవా? వర్షం పడ్డ కాసేపే ఉంటుందన్నది మర్చిపోయావా?    ఆలోచించే నీ మెదడుకు అన్నీ తెలుసు, కాస్తకిందకి చేర వెయ్యి నీ మనసుకూ.. జరిగేది తెలుసూ, జరగనిది తెలుసూ, తెలిసీ తెలియక కాదు, ఒప్పుకోలేవని కూడా తెలుసూ, అలా ఒప్పుకోలేక చెప్పే నీ సమాధానం, ఏమో? సమాధానం ఆశించడం తప్పా? ఏమో? సమాధానం మనసుకి నచ్చకపోవడం తప్పా? ఏమో? ఏన్నాళ్ళు ఇలా ఓ మనసా, కుదురుకో, మేలుకో, వాస్తవాలు గ్రహించు, నీ మెదడు మాట విను.. -- మీ  సాయి కార్తీక్

Love Hurts

Image
నేరం నాది కాదు, నీది, నరకయాతన నీది కాదు, నాది, మనసు గాయం మాసి పోదు మదిని వీడి వెళ్ళిపోదు, నిన్నలోని నిరీక్షన, కన్నీరై కరిగిన క్షణాన, మనసు గాయం లోతు ఎంతో గుండె అడుగునున్న ఆ కన్నీటినడగాలి. స్వేచ్చగా వచ్చి నా తలుపు తట్టి వచ్చి చేరిపోయావు, వెళ్తూ వెళ్తూ స్వఛ్ఛమైన నా గుండె గుడిని మార్చేసావు, నీతో ఉన్న నిన్నటి ఆ తీపి క్షణం, తలుచుకోలేను మరే క్షణం. మనసంటే అద్దం అంటారు ముక్కలైతే అతకదంటారు, నీకోసం పేర్చా ప్రతీ సారీ విరిగిన వెంటనే, నీ కొసం, గుచ్చుకున్న గాజు భాధంతా గుండెల్లో దాచి, నిలబడ్డా ప్రతీ సారీ నీ బొమ్మ చుడాలని, ఆ అద్దంలో. ప్రతి మాటా ప్రతి పలుకు గాలి లో కలవచ్చు కానీ, మద్యలో అవి తాకిన మది తలుపులు, పదిలం చెశాయి నీ ప్రతి మాటా, వస్తావో వెళ్తావో వుంటావూ వీడతావో, నిర్ణయం నాది కాదు, నీది, యాతన నీది కాదు, నాది. --  మీ  సాయి కార్తీక్

శ్రీ వేంకటేశుని వైభవం

Image
శ్రీ వేంకటేశుని వైభవం చూతము రారండి, శ్రీనివాసుని పాదాభివందనం చేతము రండి. నిత్యకల్యాణ నిజశోభ నెలవంకకైనా కలదా, ఆ వేవేల రతనాల కాంతి మన స్వామిదే అవదా. ఏంతో ఎత్తునున్న ఆ ఏడుకొండలవాడు, జనులందరికి అండగా కొండపై నిలుచున్నాడు. గోవర్థనమెత్తిన గోవర్ధనుడు ఈ గోవిందుడు, ఉడత భక్తిని మెచ్చిన రాముడు ఈ రమణుడు. కలిగించు నీపై భక్తి మా హ్రుదయాలలో, కురిపించు నీ కరుణ మా లోగిళ్ళలో. నిన్ను చేరాలనే తలుపు కలిగించు మా మనసులో, చెర్చుకో నీ పాదాల చెంత హరి పాదరేణువులలో. అహో ఆ శ్రీ వేంకటేశుని వైభవం, చాలవు ఈ రెండు కళ్ళు,చాలదు నూరెళ్ళ ఈ జన్మ. ఆహా ఆ కళ్యాణరాముని కరుణ, పొందాలి అందరు ప్రతి జన్మలో, జన్మాంతరాలు ఇక లేకుండా. --  మీ  సాయి కార్తీక్