Posts

Showing posts with the label telugu poetry

లక్ష్యసాధన - గమ్యఛేదన

Image
రమ్మన్నా రాదు నిన్నటి నీ కల, తాకి వెళ్ళిన గాలి తరగలా, నిద్రపోయిన నువ్వు కాదన్న మాత్రాన నిన్నటి నీ లోపం పోతుందా, మేల్కొంటే ముందడుగు వేస్తావు లోకం నివ్వెరపోయి నిన్ను చూసేట్టు, వెయ్యాలి చేతల్తో చాటింపు చెవులూరే జయజయధ్వానాలకై. నిండుగా సాగిపోయే మేఘం వర్షించక మానదు, నీ కష్టం ఫలించక మానదు, ఏ కొమ్మైనా కాయ ఇవ్వను పొమ్మంటుందా,వెన్నెల నే విరబూయను వెళ్ళిపోమంటుందా, నీటి బొట్టు నేను నడవలేనని నిలుచుంటుందా,తిరగలేనని భూమి ఆగిందా, ఆగదు ఏ నిమిషము ఏ లోకం ఆగితే సాగదు మానవ ప్రయాణము. విజయం వరించక వెళ్ళగలదా, ఓటమి వదలివెళ్ళక వెనకుంటుందా, నీ ప్రయత్నం, నీ కష్టం, నీ ఓరిమి, నీ తపన, నువ్వు వదలనంత కాలం , నీ అడుగే తొలి అడుగు, మలి అడుగే ముందదుగు. చేరగలనా గమ్యం అనే చిన్న అనుమనం, చిన్న తీరం కుడా దాటనివ్వదు, ఓటమి అనే ఊహ కుడా చివరికి ఊహకందని ఓటమి అవుతుంది, అందదనే ఆలోచన కూడా, కలవని రైలు పట్టాల్లా కలుసుకోలెవు. నిప్పుల కొలిమిని చూడందే బంగారం మెరిసిందా? కాలికింద నలగందే ఏ మట్టైనా చల్లని చలివేంద్రమయ్యిందా? శిల్పి ఉలి రుచి చూడందే శిలకి రూపం వచ్చిందా? ఒక్కో ఓటమి మెట్టు ఎక్కుతూ విజయ శిఖరం చేరు, నిన్నటి...

ఓ స్త్రీ నీకు పాదాభివందనం

Image
ఓ స్త్రీ నీకు పాదాభివందనం, అమ్మవై అందరికి జన్మవైనావు, చెల్లివై అందరికి చేరువౌతావు, భార్యవై అనుభందానికి దారివైనావు. నీ ఓర్పు కలగలిపితే భూమి అవుతుంది, నిన్ను ఙ్నానం అర్ధిస్తే శారదవే అవవా? నీ కోపం చూడాలంటే కాళీరూపమే కాదా? నీ ఐశ్వర్యం కలిగితే లక్ష్మివే అవవా? కానీ, జన్మనిచ్చి నీవు రొమ్ము పాలిస్తే, రొమ్ము జుర్రి మేము గుండెనే తంతాము. తోబుట్టువై నీవు తోడునవుదామనుకుంటే, తోడేల్లలా మేము తోలువలుస్తాము. చెలివై నీవు చెంతనచేరతావు, మాటలతో నిన్ను చిత్రహింస పెడతాము. ప్రేయసి లా మారి ప్రేమంతా కురిపిస్తే, కామంతో నిన్ను కుళ్ళబొడుస్తాము. మాది, పురుషహంకారం - మాట వినం ఇది హూంకరం, ఉన్మాదం - స్త్రీని లోబరుచుకోవడం వినోదం, పైశాచికం - ఏమాత్రం జాలి లేని అరాచకం, మాది మగజాతి, (ఆడ)మానవత్వం లేని మ్రుగజాతి!! -- మీ  సాయి కార్తీక్

??? ఏమో ???

Image
ఏమో? ఏమో? సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం, ఏమో? సమాధానం చెప్పలేని ప్రశ్నలకు సమాధానం, ఏమో? ప్రశ్నలే మనసునిండా ఉంటే వచ్చే సమాధానం, ఏమో? ప్రశ్నలే సమాధానం అయినప్పుడు చెప్పే సమాధానం, అర్థంకాలేదా పై నాలుగు వాక్యాలు, ఏమో? అర్థమైనా ఒప్పుకోలేనివా ఆ నాలుగు వాక్యాలు, ఏమో? అర్థంలేనివి అనైనా కొట్టిపారేస్తావా పోనీ, ఏమో? అర్థంవెతికే ప్రయత్నం చేస్తావా పోనీ, ఏమో? ఏమో? ఏమో? ఏమో? ఏమో? రంగుల ప్రపంచం మాత్రమే కోరుకునే ఓ మనసా, కలలేకంటూ, హరివిల్లే ఇల్లు అవ్వాలనేది నీ ఆశ, వాస్తావాల వాసన చూసేసరికి, అవాక్కయ్యవా? వర్షం పడ్డ కాసేపే ఉంటుందన్నది మర్చిపోయావా?    ఆలోచించే నీ మెదడుకు అన్నీ తెలుసు, కాస్తకిందకి చేర వెయ్యి నీ మనసుకూ.. జరిగేది తెలుసూ, జరగనిది తెలుసూ, తెలిసీ తెలియక కాదు, ఒప్పుకోలేవని కూడా తెలుసూ, అలా ఒప్పుకోలేక చెప్పే నీ సమాధానం, ఏమో? సమాధానం ఆశించడం తప్పా? ఏమో? సమాధానం మనసుకి నచ్చకపోవడం తప్పా? ఏమో? ఏన్నాళ్ళు ఇలా ఓ మనసా, కుదురుకో, మేలుకో, వాస్తవాలు గ్రహించు, నీ మెదడు మాట విను.. -- మీ  సాయి కార్తీక్