Posts

చందమా(అ)మ్మ

Image
  అమ్మ, జీవితం లో పలికే మొదటి మాట పెదవుల్లో ప్రతిసారి చిరునవ్వు నింపే మాట మనసులో నిష్కల్మషం లేని ప్రేమ పాట ఏడు సముద్రాల దూరం లో ఉన్నా కపాడే బాట   అమ్మ, నీ ప్రేమని కొలవాలంటే పది హిమాలయాలు అయినా సరితూగుతాయ నీ గుండె లోతుల్లో ఆపేక్ష తెలియాలి అంటె సముద్రాలు సరిపోతాయా నీ ప్రేమకి నీ ప్రేమే సాటి, ఇంకో కొలమానం లేదు అది ఏవరూ కాదనలేని నిజం చందమామ రావె జాబిల్లి రావె అని గోరు ముద్దలు పెడుతు అబద్ధం చెప్పావు పసివాడిగ చందమామ వస్తాడు అని నమ్మాను ఆ నిండు పౌర్ణమి లోకి ఇప్పుడు నువ్వు జారిపోయావు మరి చందమామ వస్తాడు అన్నది అబద్ధం ఐనప్పుడు  నువ్వు వెల్లిపోయింది కుడా అబద్ధమా? నిజమా?  లేదా, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా?  జీవితం లో ప్రతి అడుగు నాకు ప్రేరణ గా నిలిచి ప్రపంచాన్ని జయించే ధైర్యం నింపావు ప్రాణం పోతుంది అని తెలిసి ఈ ప్రాణం ఇచ్చావు నువ్వు నా శ్వాశలో ధ్యాసలో నిత్యం ఉంటే, నన్ను మలిచిన నువ్వు లేవని అనుకోడం తగదేమో చందమామ రాడు కాని పైనుంచి చల్లదనాన్ని పంచుతాడు  పక్షం క్షీనించినా మరో పక్షం మళ్ళీ వస్తాడు నువ్వు ఎక్కడున్నా ఆ వెన్నెలలో నీ ప్రేమ నేను చూసే చందమామలో నీ నవ్వు ఆ నిశ్శ...

ప్రాణం ఖరీదు !!

Image
  నిన్న చూసిన నవ్వు నేడు మాయం అయితే, నిన్న విన్న పిలుపు నేడు మూగబోతే, నిన్న నడిచిన నడక పడక ఎక్కితే.. బువ్వ పెట్టిన అవ్వ, తీపి పంచిన తాత, నడక నేర్పిన నాన్న, ప్రాణం ఇచ్చిన అమ్మ, ప్రేమ పంచిన అక్క, చేయూత ఇచ్చిన అన్న, పేగు పంచుకున్న చెల్లి, భాధ్యత పంచుకున్న తమ్ముడు, అలక తీర్చిన భర్త, ముడి బంధం ఆలి.. పేరు ఏమైనా, బంధం ఏదైన, కంటికి కనిపించని మహమ్మారి కబలిస్తే, మన అనుకున్న మనిషి మట్టిలోకి చెరితే, కాయం కాలిన గాయం మనం మరువనిది. ఏవరిదీ భధ్యత? నీదా? నాదా? రాజుదా? మంత్రిదా? లేదా మనందరిదా?? సమాధానం ఏదైనా, ఎవరు చెప్పగలరు, ఓ ప్రాణం ఖరీదు !! --  మీ  సాయి కార్తీక్  

సిత్తరాల సమీహనుడు

సమీహన మా అబ్బాయి పేరు. "అల వైకుంఠపురంలో " చలన చిత్రం లోని పాట స్ఫూర్తి  తో   రెండు సంవత్సరాల అల్లరి బాబు చేసే చిలిపి పనుల సమాహారం ఈ చిన్న కవిత్వం. Sameehan is my son's name and he just turned two now :) I hope all parents could relate to the naughty and cute things done by a two-year-old. Song inspired on the lines of a recent telugu movie "Ala Vaikuntapurramulo" సిత్తరాల సమీహనుడు, సిత్తరాల సమీహనుడు ఆటలే ఆపమంటె ఆపడు, సిత్తరాల సమీహనుడు పట్టు బట్టినాడ ఒగ్గనే ఒగ్గడూ.. గోడలెంట గీతలంట, సిత్తరాల సమీహనుడు రంగు రంగు రాతలంట, సిత్తరాల సమీహనుడు చరవాణి చేటయ్యాని చేతినుంచి లాగబోతే కళ్ళల్లో చెమ్మ చూపి గుండె పిండేసినాడురో.... అమ్మ అయ్య తినవయ్యాని బతిమాలి బువ్వ పెడితె (2) బువ్వొద్దు అవ్వొద్దు అని బొంగరాలు తిరిగాడు (2) గుడ్డలిప్పి స్నానమాడ తొట్టిలోకి తోలుకొస్తె (2) చెంబుకే చిల్లు పెట్టి చెంగు చెంగు దూకాడు (2) ... పక్కింటి పుల్లమ్మ పునుగులే పంపిస్తే (2) అమ్మిచ్చె అట్టు ఒగ్గేసి పునుగులే పొక్కినాడురో... సిత్తరాల సమీహనుడు, సిత్తరాల సమీహనుడు ఆటలే ఆపమ...

వెన్నెల అందం నా చెలి చందం

ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా, ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా, ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! విరబోసిన తన అందం వయ్యారం తన రూపం నే మరిచా నా లోకం ఎందుకనో ఈ మైకం, నీలో నే సగమై మనమే ఈ జగమై వర్షించే ఈ వెన్నెల్లో తడిసేదేలా, ఎలా, ఎలా !!! ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా?? నీ శ్వాస లో బంధించి నీ ధ్యాస లో నను ముంచి, నీ చూపుతో శాసించి నీ మాట తో నను కవ్వించి, నీ నవ్వుతో గిరిగీసి ఆ వలయం లో నను తోసి, నీ రూపం ఓ దారం నను పట్టీ లాగే అధికారం, నీ వెన్నెల దరహాసం అందించు నా కోసం. ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా?? ఈ పున్నమి పరితాపం నీదే తన ప్రతిరూపం, ఓ చెలి వెన్నెల, కరిగిపో వెన్నలా, ఈ వెన్నెల తమకంలో మన తనువులు తడిసేలా, ఓ వెన్నెలా, నా చెలి వెన్నెల, ఓ వెన్నెల, నా చెలి వెన్నెల!! --  మీ  సాయి కార్తీక్

దేవుడు చేసిన మనుషులు

Image
దేవుడు చేసిన మనుషులు అంటారు, దేవుడు చేతుల్లోని పావులు అంటారు, అన్నింటికీ నింద ఆ దేవుడిమీదే, మనుషుల భాధల భారం వాడిదే పాపం, ఉన్నాడా నీ ఆ దేవుడు, ఉంటే వింటాడా నీ మోర, కన్నాడా ఏనాడైనా నీ రొద, చుశాడా నీ కళ్ళలో వ్యధ. ఉన్నాడని వాదించేంతా గొప్పోడిని కాదు నేను, లేడంటూ నిందించే మనిషిని కాదు నేను, ఉన్నాడో లేదో అని అనుమానించే స్థాయిలోను లేను నేను, కానీ, ఉన్నాడని నమ్మేవాళ్ళకి ధైర్యం ఆ పైవాడు, లేదని నిందించేటోల్లకి ఏమీ చెయ్యలేని వాడు. నమ్మడం నమ్మక పోవడం నీ ఇష్టం, మొత్తం దేవుడే అని వదిలేస్తే నీకే కష్టం, నిన్ను నువ్వు నమ్ముకోడం నీ అద్రుష్టం, అలా నమ్మి ముందుకు సాగడం మహోత్క్రుష్టం. గాలిని చుశావా కళ్ళతో ? లేదని శ్వాశ ఆపగలవా? కాలాన్ని ఆపగలవా చేతితో? చేతికి గడియారం ఉందికదా అని!! కళ్ళుమూసుకుంటే కనుమరుగవుతాడా  మండే సూరీడు? దేవుడు ఓ నమ్మకం, మనిషి ఓ నిజం, నిజాన్ని నమ్ము, నువ్వు నమ్మింది నిజంచెయ్యి, నిజమైన నమ్మకం నీమీద నీకుంటే, దేవుడు కుడా నిజమౌతాడు. --  మీ  సాయి కార్తీక్

లక్ష్యసాధన - గమ్యఛేదన

Image
రమ్మన్నా రాదు నిన్నటి నీ కల, తాకి వెళ్ళిన గాలి తరగలా, నిద్రపోయిన నువ్వు కాదన్న మాత్రాన నిన్నటి నీ లోపం పోతుందా, మేల్కొంటే ముందడుగు వేస్తావు లోకం నివ్వెరపోయి నిన్ను చూసేట్టు, వెయ్యాలి చేతల్తో చాటింపు చెవులూరే జయజయధ్వానాలకై. నిండుగా సాగిపోయే మేఘం వర్షించక మానదు, నీ కష్టం ఫలించక మానదు, ఏ కొమ్మైనా కాయ ఇవ్వను పొమ్మంటుందా,వెన్నెల నే విరబూయను వెళ్ళిపోమంటుందా, నీటి బొట్టు నేను నడవలేనని నిలుచుంటుందా,తిరగలేనని భూమి ఆగిందా, ఆగదు ఏ నిమిషము ఏ లోకం ఆగితే సాగదు మానవ ప్రయాణము. విజయం వరించక వెళ్ళగలదా, ఓటమి వదలివెళ్ళక వెనకుంటుందా, నీ ప్రయత్నం, నీ కష్టం, నీ ఓరిమి, నీ తపన, నువ్వు వదలనంత కాలం , నీ అడుగే తొలి అడుగు, మలి అడుగే ముందదుగు. చేరగలనా గమ్యం అనే చిన్న అనుమనం, చిన్న తీరం కుడా దాటనివ్వదు, ఓటమి అనే ఊహ కుడా చివరికి ఊహకందని ఓటమి అవుతుంది, అందదనే ఆలోచన కూడా, కలవని రైలు పట్టాల్లా కలుసుకోలెవు. నిప్పుల కొలిమిని చూడందే బంగారం మెరిసిందా? కాలికింద నలగందే ఏ మట్టైనా చల్లని చలివేంద్రమయ్యిందా? శిల్పి ఉలి రుచి చూడందే శిలకి రూపం వచ్చిందా? ఒక్కో ఓటమి మెట్టు ఎక్కుతూ విజయ శిఖరం చేరు, నిన్నటి...

గంగా తాండవం

Image
ఉరికింది ఉరికింది ఆకాశగంగ, హరుడు హరించమని అడుగంగ, అడుగులో అడుగై నేలంతా మడుగై, పాపం పుణ్యం అన్నీ మరిచి, పిన్నలు పెద్దలు భేధం విడిచి, నింగినుండి నేలకు జారి, ఆ రెండింటిని ఏకం చేస్తూ, శివుడే నేల చేరి నాట్యమాడేనా అనేట్టుగా, ఆ హరునే హరిస్తుందేమో అనేంతగా, ఉరికింది ఉరికింది ఆకాశగంగ. గంగమ్మను ఇన్నాళ్ళు మోసిన శివయ్య, ఇక చాలనుకుని, ఇంతమందిని పొట్టనపెట్టుకోమని ఆఙాపించావా? నీ ఆఙ లేనిదే చీమైనా చలించదు కదా, నిన్ను చూడ వచ్చినవారిని నీలో చేర్చుకున్నవా? అందుకే అందర్నీ ముంచిన ఆ హిమగంగ, నిన్ను తాకే ధైర్యం చేయలేదుగా, ఆఙా నీదీ,ఆది అంతం నీదీ,ఐక్యం అయ్యే శివ తాండవం నీది!! -- మీ  సాయి కార్తీక్