వెన్నెల అందం నా చెలి చందం
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!!
నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా,
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!!
నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా,
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!!
విరబోసిన తన అందం వయ్యారం తన రూపం
నే మరిచా నా లోకం ఎందుకనో ఈ మైకం,
నీలో నే సగమై మనమే ఈ జగమై
వర్షించే ఈ వెన్నెల్లో తడిసేదేలా, ఎలా, ఎలా !!!
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!!
నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా??
నీ శ్వాస లో బంధించి నీ ధ్యాస లో నను ముంచి,
నీ చూపుతో శాసించి నీ మాట తో నను కవ్వించి,
నీ నవ్వుతో గిరిగీసి ఆ వలయం లో నను తోసి,
నీ రూపం ఓ దారం నను పట్టీ లాగే అధికారం,
నీ వెన్నెల దరహాసం అందించు నా కోసం.
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!!
నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా??
ఈ పున్నమి పరితాపం నీదే తన ప్రతిరూపం,
ఓ చెలి వెన్నెల, కరిగిపో వెన్నలా,
ఈ వెన్నెల తమకంలో మన తనువులు తడిసేలా,
ఓ వెన్నెలా, నా చెలి వెన్నెల, ఓ వెన్నెల, నా చెలి వెన్నెల!!
-- మీ సాయి కార్తీక్
Comments
Post a Comment