సిత్తరాల సమీహనుడు
సమీహన మా అబ్బాయి పేరు. "అల వైకుంఠపురంలో " చలన చిత్రం లోని పాట స్ఫూర్తి తో రెండు సంవత్సరాల అల్లరి బాబు చేసే చిలిపి పనుల సమాహారం ఈ చిన్న కవిత్వం.
Sameehan is my son's name and he just turned two now :) I hope all parents could relate to the naughty and cute things done by a two-year-old. Song inspired on the lines of a recent telugu movie "Ala Vaikuntapurramulo"
సిత్తరాల సమీహనుడు, సిత్తరాల సమీహనుడు
ఆటలే ఆపమంటె ఆపడు, సిత్తరాల సమీహనుడు
పట్టు బట్టినాడ ఒగ్గనే ఒగ్గడూ..
గోడలెంట గీతలంట, సిత్తరాల సమీహనుడు
రంగు రంగు రాతలంట, సిత్తరాల సమీహనుడు
చరవాణి చేటయ్యాని
చేతినుంచి లాగబోతే
కళ్ళల్లో చెమ్మ చూపి
గుండె పిండేసినాడురో....
అమ్మ అయ్య తినవయ్యాని
బతిమాలి బువ్వ పెడితె (2)
బువ్వొద్దు అవ్వొద్దు అని
బొంగరాలు తిరిగాడు (2)
గుడ్డలిప్పి స్నానమాడ
తొట్టిలోకి తోలుకొస్తె (2)
చెంబుకే చిల్లు పెట్టి
చెంగు చెంగు దూకాడు (2) ...
పక్కింటి పుల్లమ్మ
పునుగులే పంపిస్తే (2)
అమ్మిచ్చె అట్టు ఒగ్గేసి
పునుగులే పొక్కినాడురో...
సిత్తరాల సమీహనుడు, సిత్తరాల సమీహనుడు
ఆటలే ఆపమంటె ఆపడు, సిత్తరాల సమీహనుడు
-- మీ సాయి కార్తీక్
Comments
Post a Comment