వెన్నెల అందం నా చెలి చందం
ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా, ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా, ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! విరబోసిన తన అందం వయ్యారం తన రూపం నే మరిచా నా లోకం ఎందుకనో ఈ మైకం, నీలో నే సగమై మనమే ఈ జగమై వర్షించే ఈ వెన్నెల్లో తడిసేదేలా, ఎలా, ఎలా !!! ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నీ చల్లని ఈ చలువ లో నే సేదతీరేదేలా?? నీ శ్వాస లో బంధించి నీ ధ్యాస లో నను ముంచి, నీ చూపుతో శాసించి నీ మాట తో నను కవ్వించి, నీ నవ్వుతో గిరిగీసి ఆ వలయం లో నను తోసి, నీ రూపం ఓ దారం నను పట్టీ లాగే అధికారం, నీ వెన్నెల దరహాసం అందించు నా కోసం. ఓ వెన్నెలా...ఓ వెన్నెలా...నా వెన్నెలా!! నా చెలి కలువ కన్నులు నా పై వాలేదేలా?? ఈ పున్నమి పరితాపం నీదే తన ప్రతిరూపం, ఓ చెలి వెన్నెల, కరిగిపో వెన్నలా, ఈ వెన్నెల తమకంలో మన తనువులు తడిసేలా, ఓ వెన్నెలా, నా చెలి వెన్నెల, ఓ వెన్నెల, నా చెలి వెన్నెల!! -- మీ సాయి కార్తీక్